Monday, January 20, 2025

98 చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of gang of thieves for 98 thefts in hyderabad

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 98 దొంగ తనాలకు పాల్పడిన 11మంది సభ్యులు గల దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర దోపిడీ ముఠా తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కాగా ఈ ముఠాలోని 11మంది సభ్యులు 98 కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ ముఠా సైబరాబాద్ పరిధిలో 68, నిజామాబాద్‌లో 10, కరీంనగర్ 02, వరంగల్ 06. జగిత్యాలలో 09. కామారెడ్డిలో 02. సిద్దిపేటలో చోరీలకు పాల్పడ్డారని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ముఠా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వీరి నుంచి భారీ కట్టర్స్, రాడ్స్, స్క్రూ డ్రైవర్స్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

గజదొంగ అరెస్ట్ 

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగను గురువారం నాడు అరెస్టు చేశారు. ఈ గజదొంగకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. కోటిపల్లి చంద్రి అనే దొంగ తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సిపి తెలిపారు. నిందితుడి వద్ద 57 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.కూకట్‌పల్లి పరిధిలో 2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న చంద్రిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10, సంగారెడ్డి జిల్లా పరిధిలో 33 కేసులు ఉన్నాయని వివరించారు.

ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారీ ముఠా అరెస్ట్ 

ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి పలువురి ఎకౌంట్‌ల నుంచి డబ్బులు డ్రా చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో నిందితుల నుండి మూడు లక్షల నగదు, 2500 ఫేక్ ఫింగర్ ప్రింట్స్, 121 సిమ్ కార్డ్, 20 మొబైల్స్, డెబిట్, ఆధార్, పాన్ కార్డులు, ఏడు కేజీల ఫింగర్ ప్రింట్స్ లిక్విడ్ సీజ్ చేశారు. కాగా నిందితులు ఇప్పటి వరకు 140 ఎకౌంట్స్ హ్యాక్ చేశారని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్ ఎపిలోని కర్నూలు కలెక్టరేట్ లో డాటా ఎంట్రీ లో పనిచేసేవాడని తెలిపారు. ఈక్రమంలో వెంకటేష్ ల్యాండ్ డాక్యుమెంట్స్, బ్యాంకు డాక్యుమెంట్స్ తయారు చేయడంలో దిట్ట అని వివరించారు. ఎపి స్టేట్ పోర్టల్ ఐజిఆర్‌ఎస్ డాక్యుమెంట్స్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి ఎఇపిఎస్ సర్వీసు ద్వారా బ్యాంకు ఎకౌంటు హోల్డర్స్ మనీ విత్ డ్రా చేశారన్నారు.ఈ కేసులో ప్రధాన నిందితునికి సహకరించిన మరో ఆరుగురి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News