Monday, December 23, 2024

అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: రెండు డిసిఎంలు ఒక బొలేరో వాహనాల ముందు స్విప్ట్ డిజైర్ కారులో కొందరు వ్యక్తులు వెంబడిస్తూ పోలీసులకు చిక్క కుండా గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన శుక్రవారంభూదాన్‌పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి వద్ద జరిగింది. చౌటుప్పల్ సిఐ మహేష్, పోచంపల్లి ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపి వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి రెండు డిసిఎంలు, మహబూబాబాద్ నుంచి ఒక బొలేరో వాహనంలో హైద్రాబాద్‌కు 130 గోవులను అక్రమంగా తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం తెల్లవారు జామున 3. 30 గంటల ప్రాంతంలో పిలాయిపల్లి గ్రామ శివార్లలో వాహన తనిఖీలు చేపట్టి గోవులను, తరలిస్తున్న వాహనాలను, స్విప్ట్ డిజైర్ కారును పట్టుకుని 8మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, అలాగే హైద్రాబాద్‌లోని జియాగూడలోగల గోశాలకు 130 గోవులను తరలించినట్లు ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News