Saturday, January 11, 2025

అంతరాష్ట్ర చైన్‌స్నాచర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరుసగా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన మంగళసూత్రం, రూ.2లక్షల విలువైన గోల్డ్ చైన్, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మహారాష్ట్ర, ముంబాయికి చెందిన అంజద్ ఇక్బాల్ షేక్ అలియాస్ అంజద్ షేక్ ఆటోడ్రైవర్, నురేయిన్ శౌకత్ హుస్సేన్ ఖాన్, తన్‌వీర్ ఖాన్, విజయ్ కమల్‌కాంత్ యాదవ్ కలిసి చైన్‌స్నాచింగ్‌లు చేస్తున్నారు. ఈనెల 13వ తేదీన చందానగర్‌కు చెందిన కోటా సుబ్బరత్తమ్మ తన కుమారుడిని పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లింది. పిల్లలను తీసుకుని మారుతి ఆస్పత్రి వద్దకు రాగానే గుర్తుతెలియని ఇద్దరు యువకులు బైక్‌పై ఎదురుగా వచ్చి మహిళ మెడలోని ఐదు తులాల పుస్తెలతాడును స్నాచింగ్ చేసి పరారయ్యారు.

బాధితురాలు నిందితుల ఆనవాళ్లతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ముంబాయికి చెందిన నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి విచారించగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన మరిన్ని చైన్‌స్నాచింగ్‌లు బయటపడ్డాయి. నిందితులు అదే రోజు ఐదుగంటల వ్యవధిలో మియాపూర్, చందానగర్, ఆర్‌సి పురం, సంఘారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్ చేసినట్లు విచారణలో బయటపడింది. ముగ్గురు నిందితులు చోరీలు చేయగా కమల్‌కాంత్ యాదవ్ రిసీవర్‌గా పనిచేస్తున్నాడు. ఇన్స్‌స్పెక్టర్ పాలవెల్లి ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News