Monday, December 23, 2024

అంతర్రాష్ట్ర సైబర్ నిందితుని అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసినట్లు, నిందితుడైన బీహార్ వాసి కుందన్ కుమార్ (25) నుంచి రూ. రెండు లక్షలు,మూడు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి అఖిల్ మహజన్ తెలిపారు. సిరిసిల్లలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్‌పి మాట్లాడుతూ బీహర్‌కు చెందిన కుందన్ కుమార్ (25) తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మానేసి, బేసిక్ కంప్యూటర్ కోర్సు నేర్చుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడ్డాడన్నారు.

అతను జల్సాలకు మరిగి అనేకమందిని ఆన్‌లైన్ మోసాలకు గురి చేశాడన్నారు. విలాసవంతమైన జీవితం కోసం వివిధ సిమెంట్ కంపనీల పేరుతో తప్పుడు వివరాలు నమోదు చేసి సిమెంట్ కోసం అవసరమున్న వారు సంప్రదిస్తే వారిని మోసం చేసి డబ్బులు స్వాహ చేసేవాడన్నారు. బిర్లా ఎ 1 కంపెనీ పేరుతో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఉత్తం అంజయ్య అనే వ్యక్తి తనకు 640 నాన్ ట్రేడింగ్ సిమెంట్ బస్తాలు కావాలని కోరగా అతని దగ్గర రెండు దఫాల్లో 1,69,6000 రూపాయలు, 95,400 రూపాయలు తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న కుందన్ కుమార్ మరోసారి 11000 రూపాయలు కావాలని అడగడంతో మోసపోయినట్లు గ్రహించిన అంజయ్య పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని బీహర్‌లోని కటార్ధిలో సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ మొగిలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News