Monday, December 23, 2024

అంతరాష్ట్ర డ్రగ్స్ విక్రయదారుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of interstate drug dealers

225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28కిలోల గంజాయి స్వాధీనం
పోలీసుల అదుపులో నలుగురు, పరారీలో ఇద్దరు
వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 225 గ్రాముల హెరాయిన్ లేదా బ్రౌన్ షుగర్, 28 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 23.61లక్షలు ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముంబాయికి చెందిన చాంద్ షాహజాదీ సయిద్ ప్లంబర్ పనిచేస్తున్నాడు, నగరంలోని బహదూర్‌పురకు చెందిన షేక్ అబ్దుల్ అలాం ఖాద్రీ అలియాస్ రషద్ అలియాస్ అలాం మోబైల్ షాపు వ్యాపారం చేస్తున్నాడు. ఎపిలోని ప్రకాశం జిల్లా, కుంబం మండలం, తురిమల్ల గ్రామానికి చెందిన షేక్ ఖాసీం అలియాస్ చిన్న ఖాసీ అలియాస్ కాశీ ఈశ్వర్ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. చాంద్రాయణగుట్టకు చెందిన షాహెద్ కమల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

మరో ఇద్దరు నిందితులు ముంబాయికి చెందిన మహేష్ అలియాస్ రయిస్, విశాకపట్టణానికి చెందిన వి.రమేష్ పరారీలో ఉన్నారు. ముంబాయికి చెందిన చాంద్ షహజాదీని ముంబాయి పోలీసులు 2010లో అరెస్టు చేశారు. నగరంలోని బహదూర్‌పురకు చెందిన షేక్ అబ్దుల్ అలాం ఖాద్రీ అలియాస్ రషీద్ అలియాస్ అలాం దుబాయి కరెన్సీ ఉండడంతో డిఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. షేక్ ఖాసీం అలియాస్ చిన్న ఖాసీం అలియాస్ ఖాషీ ఈశ్వర్ రంగారెడ్డి పోలీసులు 2018లో ఎన్‌డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. షేక్ అబ్దుల్ అలాం ఖాద్రీ ఉస్మానియా బిస్కట్ల వ్యాపారం చేస్తున్నాడు. ముంబాయికి బిస్కట్లను సప్లయ్ చేసేవాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాదారుడు, ప్రధాన నిందితుడు చాంద్ షాహజాదా సయిద్ అలియాస్ చాంద్‌తో పరిచయం ఏర్పడింది. షేక్ అబ్దుల్ అలాం ఖాద్రీ తాను ముంబాయికి గంజాయి సరఫరా చేస్తానని చెప్పాడు. దీనికి షహజాదీ ఒప్పుకుని గంజాయి విక్రయించేందుకు అంగీకరించాడు.

ఈ క్రమంలోనే షేక్‌అబ్దుల్ అలాం ఖాద్రీ, షేక్ ఖాసీం అలియాస్ చిన్నఖాసీంతో కలిసి గంజాయి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. ఇద్దరు కలిసి పాడేరుకు చెందిన వి. రమేష్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నారు. అరకు నుంచి గంజాయిని రూ.8,000 కిలో చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వస్తున్నారు. వీరి వద్ద చాంద్ షహజాదీ, మహేష్ అలియాస్ రయిస్ గంజాయి తీసుకుని డ్రగ్స్ ఇస్తున్నారు. హెరాయిన్‌ను గ్రాముకు రూ.1,100 విక్రయిస్తున్నారు. ఇక్కడికి డ్రగ్స్ తీసుకుని వచ్చి వీరు వారి స్నేహితుడు షాహెద్ కమల్‌కు రూ.2,500కు గ్రామును విక్రయిస్తున్నారు. అతడు అవసరం ఉన్న వారికి రూ.7,000, రూ.9,000లకు విక్రయిస్తున్నాడు. ఈ సమచారం రావడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సైలు ఎండి ముజఫర్‌అలీ, మల్లికార్జున్, రంజిత్, షేక్ కవియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News