సిటిబ్యూరోః ఒడిసా నుంచి హైదరాబాద్‌లోని పాతబస్తీకి గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను ఎస్‌ఓటి మల్కాజ్‌గిరి, కీసర పోలీసులు కలిసి పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 430కిలోల గంజాయి, వ్యాన్, నగదు రూ.2,170, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేరెడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, బీదర్ మండలం, తండాజమ్గి గ్రామానికి చెందిన మోహన్ రాథోడ్ వ్యవసాయం చేస్తున్నాడు, హైదరాబాద్, నాచారానికి చెందిన పెద్ద బాబురావు ఆటోడ్రైవర్, సికింద్రాబాద్, లాలాపేట్‌కు చెందిన మద్దెల రమేష్, కర్నాటక రాష్ట్రం, బీదర్‌కు చెందిన భాహుల్యా లీలావతి అలియాస్ గంగరాజు అలియాస్ భీమారావు, గోపాల్ అలియాస్ ముల్ చంద్ యాదవ్, సంతోష్ కలిసి ఒడిసా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నారు.
ఇందులో భాహుల్యా లీలావతి, గోపాల్, సంతోష్ పరారీలో ఉన్నారు. భాహుల్య లీలావతి అలియాస్ గంగరాజుకు గంజాయి విక్రయించే వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో మిగతా వారితో కలిసి ఒడిసా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒడిసాలో 430కిలోల గంజాయి కొనుగోలు చేసి వ్యాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో గంజాయిని లోడ్ చేశారు దానిని తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. బాబు రావు వ్యానులో గంజాయి లోడ్ చేసుకుని రమేష్, మోహన్ రాథోడ్‌తో కలిసి వస్తుండగా ఈ సమాచారం పోలీసులకు తెలిపింది. కీసర వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. ముగ్గురుని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు రాములు, వెంకటయ్య, ఎస్సైలు వాసుదేవ్, పరమేశ్వర్, రఘురాముడు కలిసి పట్టుకున్నారు.