Friday, November 22, 2024

అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of interstate thieves in hyderabad

పరారీలో ఇద్దరు నిందితులు
వాకీటాకీలతో సమాచారం పంచుకుంటున్న దొంగలు

హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర నిందితులు ఇద్దరిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.4,70,500 నగదు, పిస్తోల్, నాలుగు రౌండ్లు, వాచ్‌లు, ఫోన్లు, వాకీటాకీలు, స్మార్ట్‌వాచ్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బరేలికి చెందిన వాసిం, ఘజియాబాద్‌కు చెందిన ఎండి షరీఫ్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ నగరంలోని రాజేంద్రనగర్ మండలం, శాస్త్రీపురంలో ఉంటున్నాడు. ఢిల్లీలోని బజన్‌పూర్‌కు చెందిన ఎండి నసీం వ్యాపారం చేస్తూ మైలార్‌దేవ్‌పల్లిలో ఉంటున్నాడు, మరో నిందితుడు జుబేయిర్ కలిసి చోరీలు చేస్తున్నారు. ఇందులు వాసిం, జుబేయిర్ పరారీలో ఉన్నారు. నలుగురు నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. నలుగురు స్నేహితులు చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు.

నసీం, ఎండి షరీఫ్ ఇద్దరు స్నేహితులు స్పేర్‌పార్ట్ వ్యాపారం కోసం దుబాయ్‌కు వెళ్లేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో మిగతా వారితో చేతులు కలిపారు. దాని కోసం పిస్తోల్‌ను రూ.50,000లకు కొనుగోలు చేశారు, ఆన్‌లైన్‌లో మూడు వాకీటాకీలు, తాళాలు పగుల గొట్టేందుకు ఐరన్ రాడ్ లాంటి వస్తువులను సమకూర్చుకున్నారు. నలుగురికి గతంలో క్రిమినల్ చరిత్ర ఉంది. నలుగురు నిందితులు ఢిల్లీలో కలుసుకుని చోరీలు చేసేందుకు బయలుదేరారు. నలుగురు పలు ప్రాంతాల్లో తిరిగి దొంగతనాలు చేసేందుకు కారును ఏర్పాటు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలో చోరీకి వెళితే ఆ రాష్ట్రానికి సంబంధించిన నకిలీ నంబర్ ప్లేట్‌ను అమర్చేవారు. నలుగురు కలిసి మార్చి 23వ తేదీన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోరీలు చేశారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి ఇంట్లోని విలువైన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు చోరీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, ఎపిలోని విజయవాడ, మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోరీలు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల సాయంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News