Monday, November 18, 2024

స్కామ్ నుంచి దృష్టి మరలించడానికే కేజ్రీవాల్ అరెస్టు: కేరళ సిఎం

- Advertisement -
- Advertisement -

కన్నూర్(కేరళ): ఎలక్టోరల్ బాండ్స్ అవినీతి నుంచి దృష్టి మరలించడానికే బిజెపి ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం పేర్కొన్నారు. పౌరసత్వ(సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సంఘ్ పరివార్ రాజ్యాంగ సంస్థలను తమ నియంత్రణలోకి తీసుకోజూస్తున్నాయని ఆరోపించారు.

‘సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లపై ఇచ్చిన తీర్పు తమకు హానికరమన్న సంగతి కేంద్ర ప్రభుత్వానికి, బిజిపి, సంఘ్ పరివార్ కు బాగానే తెలుసును, అందుకే దృష్టి మరలించడానికి వారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు’ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లను తేవాలన్న అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడే, అది అవినీతి పనిముట్టు కాగలదని సిపిఐ(ఎం) వ్యతిరేకించిందన్నారు. దేశంలో ఎలక్టోరల్ బాండ్లు ఇదావరకెన్నడూ జరుగనంత భారీ కుంభకోణమని పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. తమను ఎవరూ, ఎప్పుడూ ప్రశ్నించలేరన్న అభిప్రాయంతోనే బిజెపి దీనికి పాల్పడిందని అన్నారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం ద్వారా తాము చట్టానికి అతీతులమన్న అభిప్రాయాన్ని, సందేశాన్ని బిజెపి పంపిస్తోందన్నారు. ఇక సిఎఎపై కాంగ్రెస్ వైఖరిని కూడా విజయన్ ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ అజెండా అయిన సిఎఎను బిజెపి ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. సిఎఎ వివక్షపూరితమైనదని విజయన్ అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News