- Advertisement -
హైదరాబాద్: ఇంట్లో నమ్మకంగా పనిచేసి అదును చూసి చోరీ చేసిన పనిమనుషులను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో పనిచేసేవారు. చాలా రోజుల నుంచి ఇంట్లో పనిచేస్తుండడంతో యజమానులు వారిని నమ్మేవారు.
దీనిని ఆసరాగా చేసుకుని వారు ఈ నెల 3వ తేదీన ఇంట్లోని రూ.50లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను ముంబాయిలో అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. నిందితులను విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -