Monday, December 23, 2024

గిఫ్ట్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of Nigerians who cheated in the name of gift

యువతి నుంచి రూ.2.2లక్షలు వసూలు
అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్ : గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నైజీరియన్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సిసిఎస్‌లో జాయింట్ సిపి గజారావు భూపాల్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన యుతికి ఇన్‌స్టాగ్రాంలో ఘనా దేశానికి చెందిన అలోటే పీటర్ అలియాస్ చీబుజా, నైజీరియాకు చెందిన రోమాన్స్ జోషువా పరిచయమయ్యారు. ఇన్‌స్టాగ్రాంలో ఆస్కార్ లియోన్ వ్యక్తి నుంచి వచ్చిన ఫాలో రిక్వెస్ట్‌ను యువతి యాక్సెప్ట్ చేసింది. ఆస్కార్ లియోన్ తాను అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. 17622377073తో యువతితో వాట్సాప్‌లో ఛాటింగ్ చేశాడు. కొద్ది రోజులు ఛాటింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్‌షిప్‌కు గుర్తుగా పార్సిల్ పంపిస్తున్నానని చెప్పాడు.

పార్సిల్‌లో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెస్, డాలర్లు పంపిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను ఢిల్లీ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారినంటూ చెప్పాడు. మీకు పార్సిల్ వచ్చిందని వెంటనే కస్టమ్స్ ట్యాక్స్ పే చేయాలని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు వెంటనే డబ్బులు పంపించింది. తర్వాత వివిధ రకాల పేర్లు చెప్పి రూ.2.2లక్షలు తీసుకున్నారు. అయినా కూడా మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తాను మోస పోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఆలౌట్ పీటర్ చిబుజా, రొమాన్స్ జోషువా స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో రిక్విస్ట్‌లు పంపించి ఛాటింగ్ చేస్తూ పార్సిల్ పంపిస్తున్నామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎసిపి కెవిఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ వెంకటరామి రెడ్డి, ఎస్సై కీత మధుసూదన్ రావు, పిసిలు సతీష్, భాస్కర్, మురళికృష్ణ తదితరలు అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News