Thursday, December 19, 2024

అధిక వడ్డీ పేరుతో 200కోట్లు వసూలు

- Advertisement -
- Advertisement -

అధిక వడ్డీ ఇస్తామని చెప్పి పలువురి వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన ప్రియాంక ఫైనాన్స్ సంస్థకు చెందిన ముగ్గురు నిందితులను సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో జిఎంగా పనిచేసిన నిమ్మగడ్డ వాణిబాల భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్ష ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్స్ పేర్పాటు చేశారు. వాణిదేవి పనిచేస్తున్న బ్యాంక్ సమీపంలోని అబిడ్స్, తిలక్‌రోడ్డులోని రెడ్డి హాస్టల్ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేశారు. కో ఆపరేటివ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న వారికి వాణిదేవి తన భర్త నిర్వహిస్తున్న ప్రియాంక ఫైనాన్స్‌లో డిపాజిట్ చేస్తే 24శాతం వడ్డీ ఇస్తామని చెప్పింది.

దీంతో అధిక వడ్డీ వస్తుందని భావించిన కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు 140మంది రూ.26కోట్లు డిపాజిట్ చేశారు. అలాగే బయటి వ్యక్తులు డిపాజిట్ చేసే విధంగా వాణిదేవి చూశారు. దాదాపుగా 532మంది రూ.200 కోట్ల వరకు ప్రియాంక చిట్స్ అండ్ ఫైనాన్స్‌లో డబ్బులు డిపాజిట్ చేశారు. కొద్ది రోజుల వరకు నెల నెల వడ్డీ ఇస్తున్న నిందితులు జనవరి నుంచి వడ్డీ ఇవ్వడం మానేశారు. డిపాజిటర్లు డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో సంస్థను మూసివేసి కుంటుంబ ం మొత్తం పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిసిపి ఎన్, స్వేత పర్యవేక్షణలో ఎసిపి కెఎం కిరణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News