Tuesday, January 21, 2025

మైనింగ్‌పై మైలారం గరంగరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి/అచ్చంపేట ః నాగర్‌కర్నూల్ జి ల్లా, బల్మూర్ మండలం, మైలారంలో జరుగుతున్న మైనింగ్ పనులను త క్షణం నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు ని లిపివేయాలని కోరుతూ గత కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. మైనింగ్‌ని నిలిపివేయాలని, మైనింగ్ వల్ల గ్రామానికి, త మకు తీరని ముప్పు ఏర్పడుతుందని సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. పనులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ప్రధాన రహదారిపై ముళ్లకంచెలను ఏర్పాటు చేసి గ్రామంలోకి ఎవరినీ  రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో మహిళలు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. అరెస్టు చేసిన స్థానికులను వెంటనే వదిలిపెట్టాలని క్రిమిసంహారక మందుల డబ్బాలు చేతపట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పలువురు వారిని వారించారు. ఇదే క్రమంలో అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని గ్రామస్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ప్రొఫెసర్ హరగోపాల్ మైలారం గ్రామానికి వస్తుండగా పోలీసులు వెల్దండ మండల కేంద్రంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలాఉండగా గత అసెంబ్లీ ఎన్నికలలో గ్రామస్థులు మధ్యాహ్నం వరకు ఓటింగ్ బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఇలా ఉన్నాయి. బల్మూర్ మండలం, మైలారం గ్రామంలోని సర్వే 121 లోని భూమిలో క్వార్జ్ తవ్వకాలకు కేటాయించిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని సర్వే నెంబర్ 121లో 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో గుట్టగా ఉన్న 35 ఎకరాలను క్వార్జ్ తవ్వకాల కోసం మైనింగ్ శాఖ కొందరికి అనుమతులు ఇచ్చింది. కొద్ది రోజుల నుంచి అక్కడ తవ్వకాల ప్రక్రియ మొదలైంది. కాగా, మైనింగ్ వలన ప్రకృతి సహజ సంపదతో పాటు తమ భూములు, ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

తమ నిరసనకు పౌర హక్కుల నేతలు హరగోపాల్, గడ్డం లక్ష్మణ్‌ను ఆహ్వానించారు. గ్రామంలోకి అధికారులు, మైనింగ్ నిర్వాహకులు రాకుండా రోడ్డుపై ముళ్ల కంచే, రాళ్లు అడ్డుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో సిఐ రవీందర్, ఎస్‌ఐ రమాదేవి గ్రామానికి వెళ్లి ప్రజలకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. కానీ వినకపోవడంతో కొందర్ని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో కొంతమంది మహిళలు పురుగుల మందు డబ్బాలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అందర్నీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పౌర హక్కుల సంఘం నేతలను వెల్దండ వద్ద పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. మైలారం గ్రామస్థులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్
పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్‌ను పోలీసులు వెల్దండ మండల కేంద్రంలో అరెస్టు చేశారు. బల్మూర్ మండలం, మైలారలో అక్రమ మైనింగ్, క్వార్జ్ తవ్వకాలను ఆపేయాలని ఆ గ్రామ ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతుగా వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రజలు చెప్పేది ప్రభుత్వాలు వినాలని, ప్రజలకు మేలు చేయడానికి తాము వెళ్తుంటే అడ్డగించడం తగదని అన్నారు. ప్రజలకు మేలు చేయడానికే ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News