Friday, December 20, 2024

యువతిని వేధించిన గాయకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of singer who harassed young woman

మర్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపు

మనతెలంగాణ, హైదరాబాద్ : యువతిని వేధించిన ముంబాయికి చెందిన గాయకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన యువతిని ముంబాయికి చెందిన అమీర్‌తారిఖ్ అనే గాయకుడు ఓ ప్రోగ్రాంలో పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఇద్దరు కలిసి ప్రొగ్రాలు చేశారు. ఈ క్రమంలోనే యువతితో గాయకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో దూరంపెట్టింది. దీంతో అమీర్ మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని యువతిని బెదిరించాడు. యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News