Wednesday, January 22, 2025

స్నాచింగ్ చేస్తున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మొబైల్ ఫోన్‌ను స్నాచింగ్ చేసిన నిందితుడు
అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు

హైదరాబాద్: మొబైల్ స్నాచింగ్‌లు చేస్తున్న యువకుడిని పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….హైదరాబాద్, ఖైరతాబాద్‌కు చెందిన కానాపర్తి రాజేంద్ర ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. విధులకు హాజరయ్యేందుకు ఖైరతాబాద్‌లోని బస్టాప్ వద్ద బస్సు కోసం వేచిచూస్తుండగా గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి బాధితుడి మొబైల్ ఫోన్‌ను స్నాచింగ్ చేసి వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అత్తార్ అలియాస్ కమాండోను అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News