Monday, December 23, 2024

బెదిరింపుకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హై దరాబాద్ ఇన్‌కం ట్యాక్స్ భవన్ లో బాంబు ఉందని ఫేక్ కాల్ చేసిన నిం దితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి హయత్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో 11న హయత్ నగర్ లోని నిర్మా నుష్య ప్రదేశానికి వెళ్లి డయల్ 100కు ఫోన్ చేసి, ఇన్ కమ్ ట్యాక్స్ టవర్‌లో బాంబు పెట్టామని బెదిరించాడు. ఆ బాంబు పేలకుండా ఉండాలంటే తనకు రూ.1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సమాచారం బాంబు స్క్వాడ్‌కు చేరవేయడంతో వారు తనిఖీలు చేశారు. ఉద్యోగులను కార్యాలయం నుండి బయటకు పంపించి పూర్తిగా గాలించారు. ఫోన్ కాల్ ఆధారంగా ద ర్యాఫ్తు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News