Thursday, January 23, 2025

చోరీలు చేస్తున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః తాళం వేసిన ఇళ్లు, దేశాలయాల్లో చోరీలు చేస్తున్న యువకుడిని చైతన్యపురి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. సూర్యాపేట జిల్లా, చివ్వెముల మండలం, కుడకుడా గ్రామానికి చెందిన గాజుల ప్రశాంత్ అలియాస్ క్రీసుదాసు హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు.

జల్సాలకు అలవాటుపడిన నిందితుడు తాళం వేసిన ఇళ్లు, దేశాలయాల్లో చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు నిందితుడు సూర్యాపేట, కోదాడ, కట్టంగూర్, కేతిపల్లి, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. రాత్రి సమయంలో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్నాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు అనుమానస్పందంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడింది. ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డిఐ నాగరాజు గౌడ్ తదితరులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News