Monday, December 23, 2024

ముగ్గురు మట్క నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాంసి బస్టాండ్ ఎరియా నందు మట్కా అడుతున్నారనే జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్‌చార్జ్జి సిసిఎస్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సిసిఎస్ బృందం దాడి చేయగా ముగ్గురు నిందితులు మట్కా నిర్వహి స్తుండగా పట్టుపడ్డారని తెలియజేశారు.

మట్కా నిర్వహిస్తూ పట్టుబడ్డ నింధితులు వసీం అత్తర్, కనక సంతోష్, ఎస్కే జలీల్‌లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ ఆశోక్ తెలిపారు. వీరి వద్ద నుండి మూడు సెల్ ఫోన్‌లు రూ. 4530 నగదు , మట్కా చటీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News