Wednesday, January 22, 2025

కార్బైడ్‌తో మామిడి పండ్లు పండిస్తున్న వ్యాపారుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాలతో మామిడి పండ్లను పండేలా చేస్తున్న వారిని ఎస్‌ఓటి పోలీసులు మంగళవారం సనత్‌నగర్‌లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 960 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. శక్తిరాజు అనే వ్యాపారి కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని ఉపయోగించి మామిడి కాయలను పండ్లుగా మారుస్తున్నట్లు సమాచారం పోలీసులకు వచ్చింది.

వెంటనే ఎస్‌ఓటి పోలీసులు రాజు గోదాంపై దాడి చేశారు. గోదాంలో పెద్ద ఎత్తున మామిడి కాయలు, 50కిలోల కార్బైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్షియం కార్బైడ్‌తో పండిన మామిడి పండ్లను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. పట్టుబడ్డ వారిని కేసు దర్యాప్తు కోసం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News