Monday, December 23, 2024

చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

బైక్‌పై వెళ్తున్న వారిపై కారం పొడి చల్లి దోచుకుంటున్న ఇద్దరు నిందితులను సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, ఫలక్‌నూమాకు చెందిన ఎండి అబ్దుల్ మజహర్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు, రఫాయ్ చదువుకుంటున్నాడు.

ఇద్దరు కలిసి బైక్‌లపై వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు బైక్‌లపై వెళ్తున్న వారి కళ్లలో కారం చల్లి, వారి వద్ద ఉన్న డబ్బులను దోచుకుని అక్కడి నుంచి పరారవుతున్నారు. ఈ నెల 07వ తేదీన చార్మినార్ పోలీస్ ష్టేషన్ పరిధిలో బైక్‌పై వెళ్తున్న యువకుడిని దోచుకునేందుకు యత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ బిక్షపతి, హెచ్‌సి శ్రీశైలం, పిసిలు షాబాజ్, విక్రం తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News