7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన నార్త్‌జోన్ డిసిపి
హైదరాబాద్: దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, వార్ద జిల్లా, కంజర్ మోహళ్లా, ఇత్వారా బజార్‌కు చెందిన గోవింద్ మనోజ్ జాదవ్ గుడుండా విక్రయిస్తుంటాడు, కన్నయ్య కిషన్ సలునాకి, అశోక్ సురేష్ జాదవ్ కలిసి చోరీలు చేస్తున్నారు. ముగ్గురు నిందితులు బంధువలు, ఇందులో అశోక్ పరారీలో ఉన్నాడు. వార్ధాజిల్లాను గాంధీ జిల్లాగా పిలుస్తారు, వైన్స్ షాపుల ఏర్పాటు నిషేధం.
దీంతో జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఇంటిలో గంజాయి తయారు చేస్తుంటారు. అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ముగ్గురు గుండుంబా తాగేందుకు బానిసగా మారారు. గుట్కా, తదితర పొగాకు వస్తువులు తింటుంటారు. వ్యసనాలు పెరగడంతో వచ్చే డబ్బులు సరిపోవడంలేదు. దీంతో బయటి రాష్ట్రల్లో చోరీలు చేయాలని ప్లాన్ వేశారు. దానిలో భాగంగా నగరానికి వచ్చారు, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దృష్టి మరల్చి పలువురి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అల్ఫా హోటల్ వద్ద నిందితులు అనుమానస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితులపై గతంలో కూడా చంద్రాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యాయి. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, డిఎస్సై శ్రీధర్ రావు తదితరులు పట్టుకున్నారు.a