Friday, December 20, 2024

నక్సలైట్లమని రైస్ మిల్లర్లను బెదిరించిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మిర్యాలగూడ: నక్సలైట్ అంటూ డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపుతామని రైస్ మిల్లర్‌లను బెదిరించిన నిందుతుడు తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, అతనికి సహకరించిన చుంచు మల్లేష్‌ను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్‌పి వెంకటగిరి తెలిపారు. సోమవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మిల్లర్ బి. శ్రీనివాస్‌ను బెదిరించిన తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, బెదిరించి మల్లేష్ ఫోన్ 9346016852పై ఫోన్ చేయాల్సిందిగా మిల్లర్‌ని కోరాడు. ఈ నేపధ్యంలో మిల్లర్ ఈనెల 18న పదివేల రూపాయలు పంపించాడు.

మిగిలిన డబ్బులు పంపాలని లేకుంటే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించగా, మిర్యాలగూడ వస్తే ఇస్తానని ఫోన్‌లో చెప్పడంతో నిందితుడు, అతనికి సహకరించిన మల్లేష్ సోమవారం ఉదయం మిర్యాలగూడ బస్ స్టేషన్‌కు రావడంతో వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి లొంగిపోయిన జనశక్తి తీవ్రవాద దళ కొరియర్‌గా సిరిసిల్ల ఏరియాలో 1996 నుండి 1998 వరకు తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి అలియాస్ ప్రమోద్ అని లొంగిపోయిన వ్యక్తి విషయం తెలిసిందన్నారు. నిందితుడు సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌కు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయాడన్నారు.

దీంతో పెద్దపల్లి, సుల్తానాబాద్ మిల్లర్లు, పెద్దపల్లి, హన్మకొండ, సుల్తానాబాద్, కరీంనగర్‌లో వ్యాపారస్తులను బెదిరించి జైలుపాలై వచ్చాడని తెలిపారు. తిరిగి ఇంటర్‌నెట్‌లో మిల్లర్ల మొబైల్ నెంబర్లను తెలుసుకొని, మిర్యాలగూడ మిల్లర్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చిక్కిపోయాడని తెలిపారు. సుదర్శన్‌రెడ్డికి హైదరాబాద్‌లో పరిచయమైన మల్లేష్ సహకరించాడన్న ఆరోపణలపై అరెస్టు చేశామన్నారు. నిందితులిద్దరినీ స్థానిక జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చనున్నామన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించి, నిందితులను పట్టుకున్న సిఐ రాఘవేందర్, ఎస్‌ఐలు ఎ. సైదిరెడ్డి, ఎ. కృష్ణయ్య, హెచ్‌సి కె. లక్ష్మయ్య, కానిస్టేబుల్ ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. రామకృష్ణలను డిఎస్పీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News