Sunday, December 22, 2024

చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు దొంగలను మేడ్చెల్ సిసిఎస్, దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.9,60,000 విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చెల్ డిసిపి శబరీష్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పందిరి స్వామి దుండిగల్‌లో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు. దుండిగల్, మల్లంపేటకు చెందిన రహీమా బేగం కూలీ పనిచేస్తుంది.

స్వామి గతంలో చోరీలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూలై,2023లో జైలు నుంచి బయటికి వచ్చాడు. అప్పటి నుంచి స్వామి, రహీమా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి చోరీ చేయాలని ప్లాన్ వేశారు. బాచుపల్లి, ఐడిఏ బొల్లారం, దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసి బంగారు ఆభరణాలు, సిల్వర్ వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, సానిటరీ ట్యాప్స్ చోరీ చేశారు. వాటిని రహీమా బేగం డిస్పోజ్ చేస్తోంది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News