Wednesday, January 22, 2025

వాహనాల దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:ఇద్దరు వాహన దొంగలను అరెస్టు చేసి రూ.కోటి విలువగల 7 కార్లు, 7ద్విచక్రవాహనాలను శనివారం మిర్యాలగూడ వన్,టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గుణగుంట్ల చరణ్ అలియాస్ చంటి బైక్ మెకానిక్.వ్యసనాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు.

శనివారం ఈదులగూడలో పోలీసులకు పట్టుబడగా విచారణలో 7బైక్‌లు దొంగిలించినట్లు తేలింది.అదేవిదంగా పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన షేక్ వాజీద్ తెలిసినవారివద్ద కిరాయికి కార్లు తీసుకుని ఇతరులకు విక్రయించేవాడు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 7కార్లును రికవరీ చేసినట్లు వెల్లడించారు. డిఎస్పీ వెంకటగిరి సూచనల మేరకు సిఐ రాఘవేంద్ర, నర్సింహారావులు ప్రత్యేక బృందాలుగా నిందితులను గుర్తించి వాహనాలను రికవరీ చేశారు.

కేసులను ఛేదించిన పోలీస్ సిబ్బందికి రివర్డులు అందించి జిల్లా ఎస్పీ అపూర్వరావు అభినందనలు తెలిపారు. డిఎస్పీ వెంకటగిరి మాట్లాడుతూ మిర్యాలగూడలో మెయిన్ రోడ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని , త్వరలోనే ప్రధాన కూడలిలో వైర్‌లెస్ సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. వారి వెంట వన్‌టౌన్ , టూటౌన్ ,రూరల్ సిఐ రాఘవేంద్ర, నరసింహారావు, సత్యనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది ,తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News