Sunday, December 22, 2024

బైక్‌లు చోరీ చేస్తున్న యువకుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బైక్‌లు చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను సిసిఎస్ హైదరాబాద్ స్పెషల్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇద్దరు యువకుల నుంచి పది లక్షల విలువైన ఐదు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…జియాగూడకు చెందిన గోపి అరుణ్, బూరే సాయినాథ్, యుగ్, జిట్టు కలిసి బైక్‌లు చోరీ చేస్తున్నారు.

కొట్టేసిన బైక్‌లను విక్రయించి నలుగురు కలిసి జాల్సాలు చేస్తున్నారు. గతంలో కూడా కుల్సుంపుర, టపాచపుత్ర పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్‌లను చోరీ చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్, కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్‌లు చోరీ చేశారు. వాటిని గురువారం విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News