Wednesday, January 8, 2025

దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టుకు మరోసారి వారెంట్ జారీ

- Advertisement -
- Advertisement -

కోర్టు ఆదేశాల మేరకు దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అరెస్టు చేసేందుకు ఆ దేశ అవినీతి నిరోధక విభాగం విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అధ్యక్షుడి అరెస్టుకు మరోసారి న్యాయస్థానం వారెంట్ జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆయనను అదుపు లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే వారెంట్ గడువు ఎప్పుడు ముగుస్తుందనే విషయం వెల్లడించలేదు.

దేశంలో స్వల్పకాలం పాటు సైనిక పాలన విధించిన కారణంగా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పార్లమెంట్ అభిశంసనకు గురైన విషయం తెలిసిందే. అధ్యక్షుడి న్యాయవాదులు మాట్లాడుతూ ఈ విధంగా అధ్యక్షుడి నివాసం లోకి ఇతరులు చొరబడడం వల్ల యూన్‌సుక్ యోల్‌కు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పోలీసుల సహాయంతో అరెస్టు చేయడానికి అవినీతి నిరోధక కార్యాలయానికి చట్టపరమైన అధికారం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News