Thursday, December 19, 2024

షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ

- Advertisement -
- Advertisement -

ఇటీవలి విద్యార్థి ఉద్యమం సందర్భంగా మానవాళిపై జరిగిన నేరాలకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతోపాటు అవామీ లీగ్ నాయకులతోసహా మరో 45 మందిపై బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం అరెస్టు వారెంట్లు జారీచేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనాతోపాటు ఇతరులపై అరెస్టు వారెంట్లను కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ మొహమ్మద్ గులాం మర్తూజా మజుందర్ చైర్మన్‌గా ఉన్న ట్రిబ్యునల్ అరెస్టు వారెంట్లు జారీచేసింది. నవంబర్ 18లోగా హసీనాతోసహా 46 మందిని అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపరచాలని సంబంధిత అధికారులను

ట్రిబ్యునల్ ఆదేశించినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తజుల్ ఇస్లామ్ వెల్లడించినట్లు డైలీ స్టార్ పత్రిక తెలిపింది. హసీనా నేతృత్వంలోని గత ప్రభుత్వం విద్యార్థి ఉద్యమ కాలంలో సాగించిన హత్యాకాండతో సంబంధం ఉన్న వారిపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణ జరిపిస్తామని బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఆగస్టులో ప్రకటించింది. ఆ హింసాకాండలో 230 మందికిపైగా ప్రజలు హత్యకు గురయ్యారు. ఈ ఏడాది జులై మధ్యలో హసీనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోటా విధానానికి వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థి ఉద్యమంలో దేశవ్యాప్తంగా 600 మందికిపైగా మరణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News