Friday, October 18, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు –

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, తాజాగా మరో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆయనతో పాటు మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావుపైనా నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. ఇరువురిపైనా నాన్ బెయిల బుల్ వారెంట్‌ను కోర్టు ఇష్యూ చేసింది. ముఖ్యంగా 73 సిఆర్‌పిసి కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల పిటిషన్‌పై నాంపల్లి న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. ఈ వారెంట్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ఇదే అంశంపై ఈ మధ్య కాలంలో ప్రభాకర్‌రావు న్యాయస్థానంలో మెమో దాఖలు చేయగా, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సాగుతుండగా పోలీసులు సిఆర్‌పిసి 73 సెక్షన్ మోపడం సరికాదని శ్రవణ్ వెల్లడించారు. అరెస్టుకు అనుమతివ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు.

కానీ అవేవీ ఫలించలేదు.మరోవైపు మాజీ సిఎం కెసిఆర్‌ది, తనది ఒకే కులం కావడం వల్లే ఎస్‌ఐబి చీఫ్‌గా నియమించినట్లు పోలీసులు చెబుతున్న దానిలో నిజం లేదని ప్రభాకర్‌రావు వెల్లడించారు. తాను కూడా కేసీఆర్ బాధితుడినేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో విపక్ష నేతలకు మద్దతిస్తున్నట్లు బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నేతలు చెప్పగా, అక్కడి నుంచి సిఐడికి బదిలీ చేశారని మెమోలో ప్రభాకర్ రావు వెల్లడించారు. ఈ క్రమంలోనే డిఐజి నుంచి ఐజిగా పదోన్నతి కల్పించేందుకు ఐదు నెలలు ఆలస్యం చేశారని స్పష్టం చేశారు. ఎస్‌ఐబిలో ఎస్‌పిగా పదేళ్ల అనుభవం ఉండటం, అప్పటి డిజిపి సిఫార్సుతోనే ఎస్‌ఐబి చీఫ్‌గా నియమించారని చెప్పుకొచ్చారు. ఎస్‌ఐబి చీఫ్‌గా అప్పటి డిజిపి, ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పని చేశానని, ప్రతి అంశాన్ని వారి నోటీస్‌లో ఉంచినట్లు వెల్లడించారు. అక్కడ స్వతంత్రంగా పని చేసే అధికారం ఉండదని స్పష్టం చేశారు. 30 ఏళ్ల తన ఉద్యోగ జీవితంలో ప్రతిభతో 2012లో ప్రతిష్ఠాత్మక ఐపిఎం, 2016లో పిఎంజి, 2019లో పిపిఎం, అసాధారణ్ అసూచన కుశలత పదక్ పురస్కారాలు లభించినట్లు వెల్లడించారు.

తనపై వారెంట్ జారీ చేయాలని కోర్టులో దర్యాప్తు సంస్థ దరఖాస్తు చేయడం సరి కాదన్నారు. హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నానని, ప్రస్తుతం అమెరికా ఇల్లినాయిస్ పొంటియాక్‌లో ఉన్నట్లు వెల్లడించారు. నాలుకపై చికిత్స పూర్తయ్యాక తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు హాజరవుతానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ అప్లికేషన్‌ను కొట్టివేయాలని కోరారు. ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది సురేందర్‌రావు కోర్టులో ఈ మేరకు అఫిడవిట్ కూడా సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News