Monday, December 23, 2024

అదానీ ప్రభృతులపై అభియోగాలతో అరెస్ట్ వారెంట్లు తప్పవు

- Advertisement -
- Advertisement -

అప్పగింతకూ దారి తీస్తుంది
యుఎస్ అటార్నీ

న్యూయార్క్ : అనేక మిలియన్ డాలర్ల ముడుపుల పథకంపై కోటీశ్వరుడు గౌతమ్ అదానీపైన, మరి ఏడుగురిపైన యుఎస్ సివిల్, క్రిమినల్ అభియోగాలు దాఖలు చేయడంతో ఈ కేసు ముదరవచ్చునని, వారిపై అరెస్టు వారంట్ల జారీకి, తుదకు అప్పగింత యత్నాలకు దారి తీయవచ్చునని న్యూయార్క్‌లో ప్రముఖ అటార్నీ ఒకరు సూచించారు. ఖరీదైన సౌర విద్యుత్ కొనుగోలు నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాలలో గుర్తు తెలియని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించినట్లు, తద్వారా 20 ఏళ్లకు పైగా కాలంలో 2 బిలియిన్ యుఎస్ డాలర్లకు పైగా లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నట్లు భారత్‌లో రెండవ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీపైన, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా ఏడుగురిపైన యుఎస్ న్యాయ శాఖ అభియోగాలు మోపింది. అయితే. అదానీ గ్రూప్ ఆ ఆరోపణలను ఖండించింది.

యుఎస్ ప్రాసిక్యూటర్ల ఆరోపణలు ‘నిరాధారమైనవి’ అని, తమ గ్రూప్ ‘అన్ని చట్టాలను పాటిస్తుంటుంది’ అని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ‘అదానీపైన, మరి ఏడుగురు ఇతర నిందితులపైన అరెస్టు వారంట్లు జారీ చేయించేందుకు, వారు నివసించే దేశాల్లో వాటిని అందజేయించేందుకు యుఎస్ అటార్నీ బ్రియోన్ పీస్‌కు హక్కు ఉంది’ అని భారతీయ అమెరికన్ అటార్నీ రవి బాత్రా గురువారం ‘పిటిఐ’తో చెప్పారు. ‘భారత్‌కు ఉన్నట్లుగా ఆ దేశానికి అప్పగింత ఒప్పందం ఉన్నట్లయితే, సార్వభౌమ దేశాల మధ్య ద్వైపాక్షిక కాంట్రాక్ట్ ప్రకారం, యుఎస్ అప్పగించిన వ్యక్తిని నివాసితుని దేశం అప్పగించవలసి ఉంటుంది. నివాసితుని దేశం తన చట్టాల ప్రకారం వ్యవహరించేందుకు ఒక ప్రక్రియ ఉన్నది’ అని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా, భారత్, యుఎస్ 1997లో అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News