Wednesday, January 22, 2025

ఢిల్లీ క్యాబినెట్ నుంచి వైదొలిగిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ నేడు ఢిల్లీ క్యాబినెట్‌కు గుడ్‌బై చెప్పారు. వారు సమర్పించిన రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. దీని పర్యవసానంగా
ఢిల్లీ మంత్రిమండలిలో మార్పులు సంభవించే ఆస్కారం ఉంది. మంత్రివర్గంలోకి కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది.

మనీశ్ సిసోడియా 18 మంత్రిత్వ శాఖలకు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. కాగా సత్యేంద్ర జైన్‌కు ఆరోగ్య శాఖ పోర్ట్ ఫోలియో ఉండింది. కానీ ఆయన గత 10 నెలలుగా జైలులో ఉన్నారు. మనీశ్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టయిన నాయకులు ఇంకా ఢిల్లీ ప్రభుత్వంలో ఎలా ఉన్నారంటూ బిజెపి ప్రశ్నించిన తర్వాత వారు రాజీనామాలు సమర్పించారని సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఐదు మంది మంత్రులే క్యాబినెట్‌లో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News