- Advertisement -
ఇండియానా వ్యక్తి అరెస్టు
వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వంపై దాడులకు, ట్రంప్ హత్యకు పిలుపు ఇవ్వడానికి టిక్ టోక్‌ను ఉపయోగించుకున్నాడనే ఆరోపణకు గురైన ఇండియానా వ్యక్తి ఒకరిని అరెస్టు చేశారు. గోషెన్‌కు చెందిన 23 ఏళ్ల డగ్లస్ థ్రామ్స్ ఈ వారం సామాజిక మాధ్యమ వేదిక టిక్ టోక్‌లో పోస్ట్ చేసిన వీడియోల్లో వరుస బెదరింపులు చేసినట్లు ఎఫ్‌బిఐ ఆరోపించింది. ట్రంప్‌ను హత్య చేయవలసిన అవసరం ఉందని, ‘ఈ దఫా అవకాశం వదులుకోరాదు’ అని థ్రామ్స్ ఒక టిక్ టోక్ వీడియోలో కోరినట్లు ఎఫ్‌బిఐ ఏజెంట్ ఒకరు ఒక కోర్టు ఫైలింగ్‌లో రాశారు. బెదరింపుల కోసం అంతర్ దేశ వాణిజ్య సంస్థను వినియోగించుకున్నట్లు అతనిపై అభియోగం మోపారు. సౌత్ బెండ్‌లో ఫెడరల్ కోర్టులో సోమవారం హాజరు కోసం నిరీక్షిస్తూ థ్రామ్స్ కస్టడీలో ఉన్నాడు. అతనికి ఇప్పటి వరకు ఒక అటార్నీ లేరు.
- Advertisement -