Monday, December 23, 2024

అరెస్టులు అప్రజాస్వామికం : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా బిజెపి పోరాటం కొనసాగుతుందని, సెప్టెంబరు 7వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం పార్టీ రాష్ట్రకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌ల ముట్టడిలో అరెస్టయిన బిజెపి నాయకులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి బాబుమోహన్, శ్రీరాములు యాదవ్ తో పాటు కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. తమకు కేటాయించిన కార్యాలయాలను ప్రభుత్వం అప్పజెప్పిన అడ్డాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల కోసం కట్టిన క్యాంపు కార్యాలయాల దగ్గరకు ప్రజలు వెళ్తే.. కర్రలతో, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గం, అప్రజాస్వామికం అన్నారు. 27న ఖమ్మంలో జరిగే సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని, పెద్ద ఎత్తున్న ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News