Sunday, December 22, 2024

రిజిస్ట్రేషన్ల శాఖలో భయం భయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అరెస్టులు, సస్పెన్షన్ అయిన ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. ఆ శాఖలో సస్పెండ్ అయి న అటెండర్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్నా ప్రభు త్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఏసిబి కేసు లో అరెస్టు అయిన వారికి మాములుగా రెండు సంవత్సరా ల పాటు సస్పెన్షన్ ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌లో చిన్నచిన్న కారణాలతో సస్పెన్షన్ అయిన తమను సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలైన కనీసం తమను విధుల్లోకి తీసుకోవడంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు నిర్ల క్షం వహిస్తున్నారని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ ఉద్యోగు లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన నాయకులపై ఒ త్తిడి తీసుకురావడంతో ఉద్యోగ సంఘం నాయకులైన స్థితప్రజ్ఞ, ముజీబ్‌హుస్సేనీ, ప్రణయ్, సిరాజ్, సహదేవ్‌లు ఆ శాఖ కమిషనర్‌ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు.

ఒక సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్‌ల అరెస్టు
15 రోజుల క్రితం ఒక భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని, మూసాపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మరో కేసులో సీనియర్ అసిస్టెంట్ సాయిరాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టు సమయంలో ఆ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే పోలీసులు వా రిని అరెస్టు చేశారని ఆ శాఖ ఉద్యోగ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ ఇద్దరిని అకారణంగా పోలీసులు అరెస్టు చేశారని ఇలా అయితే తాము రిజిస్ట్రేషన్ ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. కనీసం డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చే స్తారని, గతంలో కోర్టు కూడా అనుమతి తీసుకోవాలని తీ ర్పు ఇచ్చిందని, అయినా పోలీసులు తీర్పును పరిగణలోకి తీసుకోవడం లేదని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు మూసాపేట పరిధిలో ప నిచేసే మరో సబ్ రిజిస్ట్రార్ కూడా అరెస్టు భయంతో వారం రోజుల నుంచి ఆఫీసుకు రావడంలేదని ఆయన గురించి పోలీసులు గాలిస్తున్నారని ఇలా అయితే విధులు నిర్వహించడం కష్టమని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు.

వివిధ కారణాలతో 11 మంది సస్పెన్షన్
సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో సస్పెన్షన్ గురైన 11 మంది స్టాంపులు, రిజిస్ట్రేషన్ శా ఖ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆ శాఖ యూనియన్ నాయకులు కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశా రు. ఎంఏ అయిజ్, జూనియర్ అసిస్టెంట్ (నిర్మల్, సబ్ రిజిస్ట్రార్), వి.అరుణ్‌కుమార్ (నిర్మల్, సబ్ రిజిస్ట్రార్), ఎండి మక్సూద్ అలీ (గ్రేడ్ 1, ఎంవి, ఆడిట్, ఆదిలాబాద్), పి.శ్రీనివాసచారి జూనియర్ అసిస్టెంట్ (కల్వకుర్తి, సబ్ రిజిస్ట్రార్), మొయిజ్ అలీఖాన్, (సీనియర్ అసిస్టెంట్, ఖ మ్మం), సి.సుధీర్ (జూనియర్ అసిస్టెంట్, మోత్కూర్), ఏ. రాజేశ్ (సీనియర్ అసిస్టెంట్, వరంగల్, డిఐజీ ఆఫీస్), ఎస్.రమణ (సీనియర్ అసిస్టెంట్, తూప్రాన్, సబ్ రిజిస్ట్రార్), కె.సంపత్‌కుమార్ (సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్,

ఆర్ (ఓబి)), ఏ.విజయలక్ష్మీ (జూనియర్ అసిస్టెంట్, మేడ్చల్ మల్కాజిగిరి, (ఆర్‌ఓ)), కృష్ణ (సీనియర్ అసిస్టెంట్, ఘట్‌కేసర్, సబ్ రిజిస్ట్రార్)లు ఇప్పటివరకు వివిధ కారణాలతో సస్పెండ్ అయ్యారు. వారిని విధుల్లోకి తీసుకోవడానికి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నించడం లేదని పలువురు ఆశాఖ ఉద్యోగులు యూనియన్ నాయకులపై ఒత్తిడి తీసుకొస్తుండడంతో ప్రస్తుతం యూనియన్ నాయకులు ఆ శాఖ కమిషనర్‌ను కలిసి ప్రస్తుతం శాఖలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి కమిషనర్‌కు విన్నవించారు. త్వరలోనే కమిషనర్ ఈ విషయాన్ని మంత్రికి, సిఎస్ దృష్టికి తీసుకెళతానని హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News