Sunday, December 22, 2024

రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టి20 ప్రపంచ కప్‌లో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో విజయంలో ఆయన కీలక పాత్ర పోషించడంతో మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గతంలో అశ్విన్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్ల తీసి 11 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్ బౌలర్‌గా అశ్విన్ రికార్డును అర్ష్‌దీప్ సింగ్ కొల్లగొట్టాడు. టి 20 వరల్డ్ కప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ మీడియాలో మాట్లాడారు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో సరైన ప్రదేశంతో బంతులు వేయడంతో వికెట్లు తీసుకున్నానని వివరణ ఇచ్చాడు.

గత రెండు మ్యాచ్‌లలో దారుళంగా పరుగులు ఇవ్వడంతో జట్టు మేనేజ్‌మెంట్ తనపై నమ్మకం ఉంచి, తన ఆటను కొనసాగించినందుకు కెప్టెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో సంతోషంగా ఉందని అర్ష్‌దీప్ సింగ్ తెలిపారు. ఇలాంటి పిచ్‌పై అనవసరంగా పరుగులు ఇస్తే లక్ష ఛేదన కష్టం అవుతుందన్నారు. సూపర్-8లో ఇదే బౌలింగ్‌తో గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. న్యూయార్క్ గ్రౌండ్‌లో అత్యధిక లక్ష ఛేదన ఇదే కావడం గమనార్హం. అమెరికాపై 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించి గెలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News