Wednesday, January 22, 2025

కొత్త దర్శకుడైనా శరత్‌లో చాలా క్లారిటీ వుంది

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన సాహి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. “రామారావు ఆన్ డ్యూటీ… నాకు ఛాలెజింగ్ మూవీ. నాకు ప్రతి రెండేళ్ళకోసారి పిరియాడికల్ సినిమాలు వస్తున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ 95లో రూరల్ జరిగే కథ. 95 నేపథ్యాన్ని దాదాపు మొత్తం రిక్రియేట్ చేశాం. చాలా రీసెర్చ్ చేశాం. ఆనాటి గ్రామం, వీధులు, ఎమ్మార్వో ఆఫీస్.. ఇలా అద్భుతమైన సెట్స్ వేశాం. అలాగే పాటల కోసం కూడా గ్రాండ్ సెట్స్ వేశాం. శరత్ కొత్త దర్శకుడైనప్పటికీ ఆయనలో చాలా క్లారిటీ వుంది. దర్శకుడు క్లారిటీగా వున్నపుడు అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వస్తుంది. ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. మేము కోరుకున్నది సమకూర్చారు. ఇక ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్-వక్కంతం వంశీ సినిమాలు చేస్తున్నా”అని అన్నారు.

Art Director Sahi Suresh about ‘Ramarao On Duty’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News