Wednesday, November 6, 2024

ఈ రాత్రికే నాసా అత్యంత శక్తివంతమైన ‘ఆర్టెమిస్1’ రాకెట్ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

 

Artemis 1

కేప్ కెనావెరల్:  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ను నాసా ఈ రోజు రాత్రి ప్రయోగించనుంది. భవిష్యత్తులో మానవులు చంద్రుని ఉపరితలంపైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో  ‘ఆర్టెమిస్1’ అనే వ్యోమ నౌకను నాసా చంద్రునిపైకి పంపనుంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్ 39బి నుంచి ఈ వ్యోమనౌక బయలుదేరుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 11:45 గంటలకు షెడ్యూల్ చేశారు. వాస్తవానికి ఈ ప్రయోగం ఆగస్టు 29వ తేదీనే జరగాల్సింది. కానీ, ఇంధన లీకేజీ కారణంగా చివరి నిమిషంలో రద్దు చేశారు. ఈ సమస్యను సరిదిద్దిన శాస్త్రవేత్తలు ప్రయోగానికి అంత సిద్ధం చేశారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కూడా ప్రయోగానికి అనుమతి ఇచ్చింది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఈ రాత్రికే ప్రయోగం చేపట్టనున్నారు. 

322 అడుగుల (98 మీటర్లు) ఎత్తు ఉన్న ఈ  రాకెట్ నాసా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తిమంతమైనది కావడం విశేషం. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో ఎన్నో ఘనతలు సాధించిన నాసా… భారత్ కు చెందిన ఇస్రో మాదిరిగా చంద్రుడిపైకి వెళ్లడంలో అంతగా విజయం సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే త‌మ చ‌రిత్రలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన రాకెట్‌గా ఆర్టెమిస్‌-1ను తీర్చిదిద్దింది. కానీ, ఇంజన్లో సమస్యల కారణంగా గత సోమవారం కౌంట్ డౌన్ ను నిలిపి వేసింది. సాంకేతిక సమస్యలను సరిదిద్ది రెండో ప్రయోగానికి రెడీ అయింది. 2024లో చంద్రుని చుట్టూ వ్యోమగాములను పంపి, 2025లో వారిని ఉపరితలంపై దింపేందుకు నాసా ఈ ప్రయోగంతో మొదటి అడుగు వేయాలని చూస్తోంది. ఈ మిషన్ కోసం నాసా ఏకంగా 4.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News