హైదరాబాద్: ప్రతిరోజు జీవితంలో కీళ్లు, మోచేయి, మోకాలు, భుజాలు వంటివి అత్యంత కీలకంగా ఉండటంతో పాటు మన కదలికలకూ తోడ్పాడుతాయి. ఒకవేళ ఏదైనా గాయం లేదా సౌకర్యం ఈకీళ్లకు కలిగితే అది ఈ వ్యక్తుల జీవిత నాణ్యతపై కూడా ప్రభావం పడుతుందని అపోలో స్పెక్రాట ఆసుపత్రి ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ వైద్యులు డా. వీరేంద్ర ముద్నూర్ పేర్కొన్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ అలాంటి ఓస్దితి. అది శరీరంలో ఏకీలుపైన అయినా ప్రభావం చూపుతుంది. ఈవ్యాధి అబివృద్ది చెందుతున్న దశలో కీళ్ల జాయింట్ల వద్ద ఉన్న కణజాలంపై ఇది తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా ఎముకల చివరలను కాపాడే మృదులాస్ధి పొరకు కూడా నష్టం చేయవచ్చన్నారు.
ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక రకపు ఇన్‌ప్లమ్మెటరీ ఆర్థరైటిస్, కీళ్లు, ఎముకల నడుమ సంఘర్షణను సులభతరం చేసే జిగురులాంటి పదార్దం మృదులాస్ది. ఈవ్యాధి కారణంగా భరించరాని నొప్పి,కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. దీనినే డీజనరేటివ్ జాయింట్ డిసీజ్‌గా కూడా వ్యవహరిస్తారు. దీనికి చికిత్స ఉంది కానీ పూర్తిగా మాత్రం నయం కాదు. పెద్ద వయస్సు వారిలో అతి సహజంగా ఇది కనిపించడంతో పాటుగా వయస్సుతో పాటు సమస్యల కూడా తీవ్రమవుతుంది.శీతాకాలంలో ఆస్టియో ఆర్థరైటీస్‌తో బాధపడే వారిలో సమస్యల మరింత తీవ్రమవుతుంది. విటమిన్ డి తక్కువగా లభించడం వల్ల ఎములు, కీళ్లు మరింత బలహీనపడి సమస్య మరింత తీవ్రం అవుతుంది.
ఈశీతాకాలంలో ఈసమస్య నుంచి ఉపశమనం పొందేందుకు రోగులు అనుసరించాల్సిన విధానాలు….
విటమిన్ డి: సూర్యోదయ విటమిన్‌గా దీనిని పేర్కొంటారు. సూర్యకాంతి ద్వారా, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఇది లభిస్తుంది. శీతలగాలులు పెరగడం వల్ల ఎండలో తిరగడం తగ్గి విటమిన్ డి లోపించే అవకాశాలున్నాయి. తద్వారా నొప్పులు పెరగవచ్చు. రోజు 600 ఐయు విటమిన్ డీ తీసుకునేలా జాగ్రత్త పడాలి.
వ్యాయామాలు చేయాలి : శారీరక వ్యాయామాలు ద్వారా ఎముకల బలం పెరగడంతో పాటు ప్లెక్సిబిలిటి కూడా పెరుగుతుంది.
విశ్రాంతి : రాత్రిళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. తగినంత విశ్రాంతి, నిద్ర ద్వారా సమస్య రాకుండా చేసుకోవచ్చు.
శరీరం వెచ్చగా ఉంచుకోవాలి: శరీరం వెచ్చగా ఉంచేలా కప్పుకోవడంతో ఆర్థరైటీస్ నుంచి ఉపశమనం పొందవచ్చ.
నీరు అధికంగా తాగాలి: చల్లగాలుల్లో చాలామంది తగినంతగా నీరు తీసుకోవడం మరిచిపోతుంటారు. తగినంతగా నీరు తీసుకోవడంతో శరీరంలోని మలినాలను బయటకు పంపడం సాధ్యమైతుంది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి తప్ప, మెడికల్ షాపులో నేరుగా మందులు కొని వాడటం శ్రేయస్కరం కాదు వైద్యులు పేర్కొన్నారు.