Wednesday, January 22, 2025

ఆర్టికల్ 370 రద్దు సబబే: సుప్రీంకోర్టు కీలక తీర్పు

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ రూపొందిన ఆర్టికిల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని పేర్కొంది. జమ్ము కశ్మీర్ విషయంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, కేంద్రం వాదనను సమర్థించింది.

భారత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. జమ్ముకశ్మీర్ భారతదేశంలో చేరినప్పుడు సార్వభౌమాధికారం లేదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొంటూ ఆర్టికిల్ 370 రద్దుపై పార్లమెంటు నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ కూడా ఇతర రాష్ట్రాల వంటిదేననీ, దానికి సార్వభౌమాధికారం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంటు 2019న నిర్ణయం తీసుకుంది. అయితే జమ్ము కశ్మీర్ కు చెందిన అనేక రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసులు వేశాయి.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జమ్ము కశ్మీర్ అంతటా భద్రతాఏర్పాట్లు పటిష్ఠం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News