Friday, November 22, 2024

నగరంలో 200 మందికి ఉపాధి కల్పించనున్న అఫైన్

- Advertisement -
- Advertisement -

Artificial Intelligence Data Engineering for 200 students

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్ సంస్ద అపైన్ తన నూతన శాఖ ప్రారంభించింది. ఈఏడాది ముగిసేలోపు 200మంది కొత్త ఉద్యోగుల నియామక ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే ఏడాది క్యాలెండర్ ముగింపు నాటికి ఉద్యోగుల సంఖ్యను 350 నుండి 400కు పెంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు.  ఈ సందర్బంగా ఆసంస్ద సీఈవో మనస్ అగర్వాల్ మాట్లాడుతూ నగరం ఎదుగుదల, అభివృద్దికి అనేక అవకాశాలున్నాయని, రీసెర్చ్, డెవలప్‌మెంట్‌లోని మాఇంజనీర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం అత్యంత విన్నూతమైన ఉత్పత్తులు, సొల్యూషన్స్‌పై పనిచేస్తారని చెప్పారు.

ఇంజనీరింగ్‌లో హారిజెంటల్ స్కిల్స్, బిఎప్‌ఎస్‌ఐ, మాన్యుఫ్యాక్చరింగ్‌లో వెర్టికల్ స్కిల్స్‌పై పోకస్ చేస్తారని వెల్లడించారు. డిజిటల్, క్లౌడ్, బిగ్ డేటా టెక్నాలజీలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ఆపైన్ తన కస్టమర్‌లను చురుకైన డేటా ఆధారిత నిర్ణయాధికారంతో శక్తివంతం చేసే పరిష్కారాలను రూపొందించడం, ప్రారంబించడం కొనసాగిస్తున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News