Sunday, December 22, 2024

ఎఐ విప్లవం.. సవాళ్లెన్నో..

- Advertisement -
- Advertisement -

నియంత్రణ చర్యల దిశగా యూరోపియన్ యూనియన్ తొలి అడుగు
2023 చివరి నాటికి అమెరికాలో నిబంధనలు
భారత్, చైనా దేశాలదీ ఇదే బాట
ఫుల్‌టైమ్ ఉద్యోగులకు ఎఐతో ముప్పు: గ్లోబల్ ఏజెన్సీలు

న్యూఢిల్లీ : ఐటి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) అనే కొత్త విప్లవం కనిపిస్తోంది. కానీ ప్రపంచం కూడా దీని సవాళ్లు, ప్రమాదాల గురించి తెలుసుకుని, అప్రమత్తమవుతోంది. ఎఐని నియంత్రించడానికి పూర్తి సన్నాహాలు జరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్(ఇయు) ఈ దిశగా తొలి అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం ద్వారా యూరోపియన్ యూనియన్‌లో నియంత్రణ చర్యలు చేపట్టారు. కానీ ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు ఎఐని నియంత్రించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిందేనని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి.

అమెరికా ఇప్పటికే చర్యలు
అమెరికా కాంగ్రెస్ గత నెలలో ఎఐ గురించి చర్చించింది, ఎఐ ఫోరమ్‌ను కూడా నిర్వహించింది. దీనిలో ప్రపంచంలోని ప్రముఖ ఐటి కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. ఎఐని నియంత్రించాల్సిన అవసరం ఉందని అమెరికా కాంగ్రెస్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ కమీషన్ వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను చాట్ జిపిటి తయారీదారు ఓపెన్ ఎఐని విచారిస్తోంది. ఎఫ్‌టిఐ కూడా ఓపెన్ ఎఐ నుండి రహస్య సమాచారాన్ని కోరింది.

నీతి ఆయోగ్ కూడా నివేదిక విడుదల
అమెరికా, యూరోపియన్ యూనియన్‌ల సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు వ్యతిరేకంగా నియంత్రణ వ్యవస్థను రూపొందించే దిశగా భారత ప్రభుత్వం పని చేయడం ప్రారంభించింది. థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ అందరికీ జవాబుదారీ ఎఐపై అనేక పత్రాలను విడుదల చేసింది. దీంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ స్వతంత్ర అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.

చైనాలో కఠిన చర్యలు
ఎఐపై చైనా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. చైనాలో సర్వీస్ ప్రొవైడర్లు సాధారణ ప్రజలకు ఎఐ ఉత్పత్తులను ప్రారంభించే ముందు భద్రతా పరమైన ఆమోదం పొందవలసి ఉంటుంది. అమెరికా తరహాలో జపాన్ కూడా 2023 చివరి నాటికి ఎఐకి వ్యతిరేకంగా నిబంధనలను జారీ చేసే అవకాశముంది. జపాన్ గోప్యతా పర్యవేక్షణ సంస్థ ప్రజల అనుమతి లేకుండా సున్నితమైన డేటాను సేకరించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా జూలై నెలలో ఎఐపై అధికారిక చర్చను నిర్వహించింది. దీనిలో ఎఐ సైనిక, నాన్-మిలిటరీ అప్లికేషన్లు చర్చకు వచ్చాయి. దీనిలో ఇది ప్రపంచ శాంతి, భద్రతకు ప్రమాదకరమని రుజువైంది.

ఎఐ నుండి ఉద్యోగాలకు ముప్పు
చాట్ జిపిటి, బింగ్ చాట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ కూడా ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా లేబర్ మార్కెట్‌లో పెద్ద సమస్య తలెత్తనుందని ఆమె అన్నారు. వీలైనంత త్వరగా ఈ సాంకేతికతను నియంత్రించేందుకు నిబంధనలను రూపొందించాలని ఆమె ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల 30 కోట్ల ఫుల్‌టైమ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇప్పటికే గోల్డ్‌మన్ శాచ్స్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News