Wednesday, January 22, 2025

కోవిడ్ పాండమిక్‌లో ఎ1 కీలకపాత్ర: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్రిపుల్ ఐటికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఐఐటి హైదరాబాద్ లో ఐఎన్ఎఐని కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టిసి బస్సుల్లో ఏర్పాటు చేసిన సెన్సార్లతో పాటు కారు భద్రత కోసం ఏర్పాటు చేసిన లెజర్ కెమెరాలు, సెన్సార్లను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం 2020ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌గా ప్రకటించిందన్నారు. కోవిడ్ పాండమిక్‌లో ఎ1 కీలకపాత్ర పోషించిందన్నారు. ఎ1 ఫ్రేమ్ వర్క్‌ను లాంచ్ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అని కెటిఆర్ ప్రశంసించారు. విద్యార్థుల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. అగ్రికల్చర్ సెక్టార్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తామన్నారు. ఎ1 మీద వర్క్ చేసే స్టార్టప్స్ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాజన్నసిరిసిల జిల్లాలోని వీరన్నపల్లిలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో కూడిన మాడ్యూల్స్‌ను వాడుతున్నామన్నారు. రోడ్డు సెఫ్టీ కోసం సహాయం అందిస్తున్న ఇంటెల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. మానవ జీవితంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కామన్ మ్యాన్‌కు ఉపయోగపడే టెక్నాలజీ తీసుకరావాలని సిఎం కెసిఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. భారత్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇనిస్టిట్యూట్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News