Monday, December 23, 2024

లోకోపైలట్ అప్రమత్తతకు ‘కృత్రిమ’ నజర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోకోపైలట్లు తమ విధుల్లో అప్రమత్తంగా ఉండేలా కృత్రిమ మేధ ఆధారిత పరికరాన్ని అభివృద్ది చేస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. రైలు డ్రైవర్ కంటి రెప్పల కదలికలపై దృష్టి సారిస్తూ ఒక వేళ నిద్రమత్తు ఆవరిస్తే వెంటనే అప్రమత్తం చేయడానికి, అవసరమైతే ఎమర్జెన్సీ బ్రేకులు వేసేలా కృత్రిమ మేధ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రైల్వేబోర్డు ఆదేశాల మేరకు ఈశాన్య సరిహద్దు రైల్వే ఈ పరికరాన్ని రూపొందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రైల్వే డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ గా పిలుచుకునే ఈ పరికరం లోకోపైలట్ కొంతసేపటివరకు అప్రమత్తంగా లేనిపక్షంలో వెంటనే హెచ్చరికలు చేస్తుంది. అవసరమైతే అత్యవసర బ్రేకులు కూడా వేస్తుంది. దీనికోసం ‘ఆర్‌డీఎఎస్’ను విజిలెన్స్ కంట్రోల్ పరికరంతో అనుసంధానించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ పరికరం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. దీని పనితీరును నిర్ధారించడానికి ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మరికొన్ని వారాల్లో ఇది సిద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అని ఓ వార్తా సంస్థకు చెప్పాయి. ఇదిలా ఉండగా, ఆర్‌డీఎఎస్ అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచిస్తూ ఆగస్టు 2న రైల్వే బోర్డు ఎన్‌ఎఫ్‌ఆర్‌కి లేఖ రాసింది. పరికరం సిద్ధమైన తరువాత పైలట్ ప్రాజెక్టుగా 20 గూడ్స్, ప్యాసింజర్ రైలు ఇంజిన్‌లలో అమర్చనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News