Sunday, January 19, 2025

డయాబెటిస్ రోగులకు “కృత్రిమ క్లోమం” ఒక వరం..

- Advertisement -
- Advertisement -

డయాబెటిక్ రోగులకు కృత్రిమ క్లోమం (artificial pancreas) ఒక వరంగా మారనుంది. అయితే దీని ధర చాలా ఎక్కువ కావడంతో మధ్యతరగతి ప్రజలకు ఇది అందుబాటు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కృత్రిమ క్లోమం అసలైన క్లోమం అవయవంలా స్వయం చాలకంగా (automatinally ) అనుకరించి బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తుంది. ఎంత ఇన్సులిన్ అవసరమో లెక్కగట్టి అంతే ఇన్సులిన్‌ను శరీరం లోకి పంపిస్తుంది. ఈ సాధనం మొబైల్ యాప్ ద్వారా కూడా క్రమబద్ధీకరణ అవుతుంది. ఈ సాధనానికి సెన్సార్ (sensor), కాథెటర్ (catheter), ఇన్సులిన్ పంప్ ఉంటాయి. కాథెటర్ అంటే పొట్టలోకి ఆహారం వంటివి పంపించేందుకు ఉపయోగించే గొట్టాం అని డయాబెటాలజిస్టు డాక్టర్ నితిన్ రెడ్డి చెప్పారు. సెన్సార్ ఒక పాచ్ వలె ఉండి చర్మం కింద ఉంటుంది. శరీరం లోని సుగర్ స్థాయిలను కనిపెడుతుంది.

ఇది కాథెటర్‌కు కనెక్టు అయి ఉంటుంది. దీని ద్వారా ఇన్సులిన్ విడుదల అవుతుంటుంది. కాథెటర్ ఒక పంపుతో కనెక్టు అయి ఉంటుంది. ఈ పంపు ఇన్సులిన్‌ను నిల్వచేస్తుంది.పంపు రోగి బెల్టుతో ఒక ఫోన్ మాదిరి సంబంధం కలిగి ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ రోగులకే దీన్ని సిఫార్సు చేస్తున్నట్టు డాక్టర్ నితిన్ చెప్పారు. టైప్ 1 డయాబెటిస్ యువకుల్లో బాగా కనిపిస్తోంది. ఎందుకంటే వారి శరీరంలో ఎలాంటి ఇన్సులిన్ ఉత్పత్తి కావడం లేదు. ఫలితంగా సుగర్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్నేళ్లలో ఈ సాధనం అందుబాటు లోకి వస్తే రోగులు మానవీయంగా ఇన్సులిన్ డోసేజ్‌ను లోపలికి ప్రవేశ పెట్టుకోగలుగుతారు. ఇటీవల అభివృద్ధి చెందిన కొన్ని సాధనాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇవి ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరించడానికి కృత్రిమ మేథస్సును వినియోగిస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. అయితే ఇవి కేవలం ప్రారంభ దశ లోని మాత్రమే ఇన్సులిన్‌ను క్రమబద్ధం చేయగలుగుతున్నాయి. ఈ సాధనం టైప్ 1 డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనం కలిగించేవిగా ఆదర్శవంతమైనా భారత్‌లో వీటి ధర రూ.5 లక్షల వరకు ఉంటోంది. ఇంతకన్నా తక్కువ ధరకు అందుబాటు లోకి రావడం అనేది ఇంకా దూరంలో ఉంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) పరిశోధకులు తక్కువ ధరలో ఈ సాధనం అందుబాటు లోకి రాడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News