Monday, December 23, 2024

ఘనంగా “ఆర్టిస్ట్” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

సంతోష్ కల్వచెర్ల, క్రిషిక పటేల్ హీరో హీరోయిన్లుగా ఎస్ జె కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్న సినిమా ఆర్టిస్ట్. ఈ సినిమాను దర్శకుడు రతన్ రిషి రూపొందిస్తున్నారు. తణికెళ్ల భరణి, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, భద్రం, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఆర్టిస్ట్ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆర్టిస్ట్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

యాక్టర్ భద్రం మాట్లాడుతూ – డైరెక్టర్ రతన్ రిషి ఆర్టిస్ట్ సినిమా కథ చెబుతున్నప్పుడు ఈ జెనరేషన్ డైరెక్టర్స్ ఎంత టాలెంటెడ్ గా ఉంటున్నారు అనిపించింది. గ్లింప్స్ చూస్తే మేకింగ్ హాలీవుడ్ మూవీలా ఉంది. మమ్మల్ని ఆర్టిస్ట్స్ అని పిలుస్తుంటారు. ఈ సినిమా తర్వాత ఆర్టిస్ట్ అంటే భయపడతారు. ప్రొడ్యూసర్ సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమాతో హీరో సంతోష్, హీరోయిన్ క్రిషికకు మంచి పేరొస్తుంది. ఆర్టిస్ట్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ తాగుబోతు రమేష్ మాట్లాడుతూ – ఆర్టిస్ట్ సినిమాలో హీరో సంతోష్ పర్ ఫార్మెన్స్ బాగుంటుంది. అప్పటిదాకా మాతో సరదాగా మాట్లాడుతు ఉండేవాడు..కెమెరా ముందుకు రాగానే క్యారెక్టర్ లోకి సడెన్ గా వెళ్లిపోయేవాడు. ఆర్టిస్ట్ కు ఉండాల్సిన క్వాలిటీ అది. హీరోయిన్ క్రిషిక కూడా యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తుంది. మా డైరెక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. తను అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించాడు. అన్నారు.

యాక్టర్ కిరీటి మాట్లాడుతూ – ఆర్టిస్ట్ అనేది ఒక డిఫరెంట్ మూవీ. గ్లింప్స్ లో చూసినట్లు వెరైటీగా మూవీ ఉంటుంది. డైరెక్టర్ మాతో బాగా పర్ ఫార్మ్ చేయించారు. ప్రతి క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేశారు.  ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. అన్నారు.

డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ – ప్రతి ఒక్కరిలో కళ ఉంటుంది. అది టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుంది. అందరి ఆర్టిస్టుల్లాగే నేనొక ఆర్టిస్టును పరిచయం చేశాను. అయితే అతను వైలెంట్ గా ఉంటాడు. మా సినిమా గ్లింప్స్ చూస్తే ఇది థ్రిల్లర్ అనుకుంటారు గానీ ఇందులో లవ్, ఎమోషన్, కామెడీ వంటి అన్ని షేడ్స్ ఉంటాయి. డార్క్ కామెడీలా సీన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ నా కోసమే ఈ ప్రాజెక్ట్ చేశారు. ప్రతి ఆర్టిస్ట్ సపోర్ట్ చేశారు. ప్రభాకర్ ఎంట్రీతో వచ్చే సీన్ నుంచి మా సినిమా మొదలవుతుంది. ఆ సీన్ నుంచే థియేటర్స్ లో ఫోన్స్ పక్కన పెట్టేసి సినిమాలోకి వెళ్లిపోతారు. గ్లింప్స్ తో మీకొక మూవీ మీద మీకొక అంచనా వచ్చి ఉంటుంది. టీజర్, ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంటాయి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – డైరెక్టర్ రతన్ రిషి లాస్ట్ ఫిల్మ్ కూడా నేనే మ్యూజిక్ చేశాను. ఈ కథ విన్న తర్వాత  మంచి సినిమా అవుతుందనిపించింది. ఇది డైరెక్టర్ కు లైఫ్ ఇచ్చే మూవీ. ప్రొడ్యూసర్ గారు కథ కూడా వినకుండా కేవలం డైరెక్టర్ రతన్ రిషి మీదున్న నమ్మకంతో సినిమా చేశారు. ఆర్టిస్ట్ మూవీ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ గా ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ నువ్వు తోపురా అనే మూవీ చేశాను. గీతా ఆర్ట్స్ ద్వారా ఆ సినిమాను యూఎస్ లో కూడా రిలీజ్ చేశాం. ఆర్టిస్ట్ మూవీ గురించి యాక్టర్ ప్రభాకర్ నాతో చెప్పారు. సినిమా మంచి కాన్సెప్ట్ అని అన్నారు. అలా మరికొందరు నాకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. దాంతో కథ కూడ వినకుండా మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చా. సెట్ లో డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ చూశాక..ఇతను గ్యారెంటీగా పెద్ద డైరెక్టర్ అవుతాడని అనిపించింది. సురేష్ బొబ్బిలి లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఇతన టెక్నీషియన్స్ కుదిరారు. ఆర్టిస్టులు కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమా చేశారు. ఆర్టిస్ట్ సినిమాతో ఒక మంచి హీరోను ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాం. హీరోయిన్ క్రిషిక కూడా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ సినిమా మా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ క్రిషిక పటేల్ మాట్లాడుతూ – ఆర్టిస్ట్ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఆర్టిస్ట్ మూవీతో టాలీవుడ్ లోకి రావడం హ్యాపీగా ఉంది. ఇదొక మంచి మూవీ. మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. అని చెప్పింది.

హీరో సంతోష్ కల్వచర్ల మాట్లాడుతూ – మా ఆర్టిస్ట్ మూవీ చిన్న ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయ్యింది. మా ప్రొడ్యూసర్ గారు వచ్చిన తర్వాత పెద్ద ఆర్టిస్టులు అంతా జాయిన్ అయ్యారు. ఇంతమంది పేరున్న నటీనటులు మా సినిమాలో ఉండటం నాకే షాకింగ్ గా ఉండేది. గ్లింప్స్ లాగే సినిమా కూడా మీకు నచ్చుతుంది. అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News