Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ ఫోటోలతో ఆర్టిస్టు ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర

- Advertisement -
- Advertisement -

హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్
ఆర్టిస్టు స్వయంగా గీసిన చిత్రాలను స్వీకరించి, అభినందనలు తెలిపిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ పట్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి అభిమానం చాటుకున్నారు. ఏడు రోజుల పాటు సైకిల్ ప్రయాణం కొనసాగించారు. పట్టుదలతో అనితరసాధ్యమైన అభివృద్ధి చేస్తున్న సిఎం కెసిఆర్ అంటే ఆర్టిస్టు రామాంజనేయ రెడ్డికి ఎనలేని అభిమానం. శుక్రవారం ప్రగతి భవన్‌కు వచ్చిన ఆర్టిస్టు బృందాన్ని సాదరంగా ఆహ్వానించిన మంత్రి కెటిఆర్ వారికి సిఎం కెసిఆర్ తరఫున అభినందనలు తెలిపి మంత్రి కెటిఆర్ ఆదరించారు. దివ్యాంగుడుగా అనేక కష్టాలననుభవించి, స్వయం కృషితో పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా ఎదిగిన తుపాకుల రామాంజనేయ రెడ్డిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరు పట్టణం.

పట్టువదలకుండా అనుకున్నది సాధిస్తూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వస్తున్న సిఎం కెసిఆర్ అంటే వల్లమాలిన అభిమానమని రామాంజనేయరెడ్డి వెల్లడించారు. తెలంగాణను సాధిం చడమే కాకుండా అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న సిఎం కెసిఆర్ ఆదర్శవంతమైన నేతగా పేర్కొన్నారు. అదే అభిమానంతో ఇరువై రోజుల పాటు కష్టపడి కాన్వాస్ మీద ఆక్రిలిత్‌తో పాటు గండికోట మట్టితో మోనో కలర్‌లో చిత్రించిన సిఎం కెసిఆర్ ప్రత్యేక పెయింటింగ్ ను తాను స్వయంగా గీశానని రామాంజనేయ రెడ్డి తెలిపారు. వాటిని ప్రత్యేకంగా ఫ్రేములు కట్టించుకోని ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర ద్వారా ఏడు రోజుల పాటు ప్రయాణం చేసి తన మిత్రులతో కలిసి హైద్రాబాద్ చేరుకున్నానని రామాంజనేయరెడ్డి సంతోషంగా చెప్పారు. శుక్రవారం తన బృందంతో కలిసి ప్రగతి భవన్‌కు చేరుకున్న ఆర్టిస్టు బృందాన్ని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సాదరంగా ఆహ్వానించారు. సిఎం కెసిఆర్ పట్ల వారికున్న అభిమానాన్ని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్, వారు తెచ్చిన ఫోటోలను సిఎం కెసిఆర్ తరఫున స్వీకరించి, వారి కృషిని అభినందించారు.

KTR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News