Wednesday, January 22, 2025

ఆర్ట్స్ కళాశాల ఎన్నో పోరాటాలకు ప్రతీకగా నిలిచింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం ఎన్నో పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని విసి రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు కళాశాల ఎదుట రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటానికి ఇది నిదర్శనమని, వందేమాతరం ఉద్యమ సమయంలో పోరాటం. 1969 నాటి తొలిదశ తెలంగాణ పోరాటం, మలిదశ పోరాటానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. పదమూడు వందల మంది ప్రాణాల త్యాగాలతో నేడు మనం స్వాతంత్య్రాన్ని పొందుతున్నామన్నారు. గౌరవ సూచకంగా మౌనం పాటించడం, వారి త్యాగాలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాధిపతులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ సభ్యులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News