Monday, December 23, 2024

హత్య చేసి, 28  ఏళ్ల తర్వాత పట్టుబడిన నిందితుడు

- Advertisement -
- Advertisement -

కుటుంబ కలహాల కారణంగా భార్యను హత్య చేసి పరారైన ఓ నిందితుడు 28 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది.

చెన్నైలోని అరుంబాకానికి చెందిన హరిహర పట్టజోషి అనే వ్యక్తి ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవాడు. ఒక సంస్థలో టెలీమార్కెటింగ్ సంస్థలో పనిచేసే ఇందిరతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 1994లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయినప్పటినుంచీ పట్టజోషి తన భార్యను వేధించడం ప్రారంభించాడు. దాంతో ఇందిర విడాకులకు కోర్టులో పిటిషన్ పెట్టుకుంది. ఇది భరించలేని పట్టజోషి, 1995 ఆగస్టు 9న తన భార్య ఇందిర, అత్త రమ, బావమరిది కార్తీక్ లపై కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. అత్త చనిపోగా, భార్య, బావమరిది ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.

పరారీలో ఉన్న పట్టజోషిని పట్టుకునేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. అయితే పట్టజోషి ఒడిసాలోని గుసానినువాగాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు ఇటీవల సమాచారం అందడంతో చెన్నై పోలీసులు వెళ్లి పట్టజోషిని అరెస్టు చేసి తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News