నెచ్చెలి శశికళ, వ్యక్తిగత వైద్యుడు, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి సహా పలువురిని విచారించాల్సిందే
జయ డిసెంబర్ 4న మరణిస్తే..5న ప్రకటించారు
అవసరమైతే అపోలో చైర్మన్‌ను విచారించాలి
తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించిన ఆర్ముగస్వామి కమిషన్
నివేదికలో కీలక అంశాలు అసెంబ్లీకి నివేదిక
చెన్నై:తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సంచలనాత్మక విషయాలు ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికలో పొందుపరించింది. కమిషన్ నివేదిక ఇప్పుడు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తుండగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అనారోగ్యానికి గురైన జయలలితకు వైద్య సాయం అందించడంలో కమిషన్ అనుమానాలను లేవనెత్తిం ది. సమగ్ర దర్యాప్తు ఆవశ్యకతను నొక్కి చెప్పంది. 2016 డిసెంబర్ 5న జయలలిత మృతి చెందినట్టు ప్రకటించారు. అ యితే ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆర్ముగస్వామి కమిషన్‌ని ఏర్పాటు చేయగా, ఐదేళ్ల తరువాత కమిషన్ 600 పేజీల నివేదికను ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సమర్పించింది. ఆ నివేదికతోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. దానిని స్టాలిన్ ప్రభుత్వం మంగళవారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్ముగస్వామి కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చెలి శశికళపై విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్ (జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు), మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, మాజీ ఆరోగ్య మంత్రి సి. విజయభాస్కర్‌లను కూడా దర్యాప్తు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతేకాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణన లోకి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగానీ ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా కమిషన్ తప్పుపట్టింది. 2016 డిసెంబర్ 4 మధ్యాహ్నం 3.50 గంటలకు జయలలిత గుండెపోటుకు గురైన తరువాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్ని సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్టు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె 2016 డిసెంబర్ 4న చనిపోగా, ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5న ప్రకటించడాన్ని కమిషన్ తప్పు పట్టింది. జయలలిత డిసెంబర్ 4న చనిపోయినట్లు తాము విచారించిన ప్రత్యక్ష సాక్షులు ఇచ్చి న సమాచారాన్ని బట్టి తెలుస్తోందని పేర్కొంది. ప్ర భుత్వం అవసరమని భావిస్తే అప్పటి ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి రాంమోహన్ రావు, అపోలో ఆస్పత్రు ల చైర్మన్‌ను కూడా విచారించవచ్చునని తెలిపింది.
యాంజియోగ్రఫీ ఎందుకు చేయలేదు..?
జయలలిత అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా అమెరికాకు చెందిన ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ సమీన్ శర్మను సంప్రదించారని, ఆయన శస్త్రచికిత్సకు సిఫారసు చేశారని నివేదిక వెల్లడించింది. నవంబర్ 25న ఆయన జయలలితను పరిశీలించారని, సర్జరీకి స్వ యంగా ఆమె ఒప్పుకున్నారని, అయినప్పటికీ శస్త్ర చికిత్స నిర్వహించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కమిషన్ అభిప్రాపడింది. ఓ అధికార కేంద్రాన్ని సంతృప్తి పరిచేందుకు ఆస్పత్రి వైద్యుడు బైపాస్ ట్రిక్‌ను ఉపయోగించారని, మధ్యలో అతని ప్రమేయం ఎందుకు అవసరం పడిందో అర్థం కాని విషయంగా అభిప్రాయపడింది. జయలలితకు అం దుతున్న చికిత్స విషయం మొత్తం ఒక్క శశికళలకు మాత్రమే తెలుసునని, ఆమె ఒక్కరే వైద్యులతో సంప్రదించేవారని వివరించింది. ఆమె అనుమతి తర్వాతే వైద్యులు ముందుకు వెళ్లేవారని కూడా కుండబద్ధలు కొట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ 2018లో రాష్ట్రం లోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల సంఘటనలో పోలీసుల తీరును తప్పు పట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మర ణం, 2018 తూత్తుకూడి ఘటన లకు సంబంధించి న విచారణ నివేదికలను అసెంబ్లీకి సమర్పించింది. ఆర్ముగస్వామి నివేదికపై సిఎం స్టాలిన్ ఆచితూచి స్పందించారు. న్యాయసలహాలు తీసుకున్న తర్వాత దీనిపై ముందుకు వెళతామని పేర్కొన్నారు.
Arumuga Swamy Commission About Jayalalitha Death