Monday, December 23, 2024

అప్సర రాణి కొత్త సినిమా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంటగా వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ వి.సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. సంగీత దర్శకురాలు యం.యం.శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ “ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్ చేస్తాం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తాం”అని అన్నారు. అప్సరరాణి మాట్లాడుతూ “ మంచి రోజు ఈ సినిమా ప్రారంభమైంది. నా కెరీర్‌కు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం ఉంది”అని తెలిపారు. యం యం శ్రీలేఖ మాట్లాడుతూ “ఈ సినిమా పాటలు చాలా బాగా వచ్చాయి. పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది”అనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపినాథ్ రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News