Tuesday, November 5, 2024

అమెరికా ఎన్నికల్లో హైదరాబాదీ గెలుపు..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన అమెరికా మహిళ అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న మిడ్‌టర్మ్ ఎన్నికల్లో నలుగురు ఇండో అమెరికన్లు అమెరికా ప్రతినిధుల సభకు డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అయిన అరుణా మిల్లర్ అమెరికాలో ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. తెలంగాణలోని హైదరాబాద్ అరుణా మిల్లర్ జన్మస్థలం. ఇంతకు ముందు అరుణ రెండు సార్లు అమెరికాలో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2010 నుంచి అమెరికా చట్టసభల దిగువ సభకు ప్రాతినిధ్యం వహించారు. అమెరికాలో ఇప్పుడు మిడ్‌టర్మ్ ఎన్నికలు జరుగుతున్నాయి.

అమెరికాలో ప్రతిపక్ష, ట్రంప్ నాయకత్వపు రిపబ్లికన్ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మేరీలాండ్ కీలకమైనది. ఇక్కడి ఎన్నికలలో అరుణ మంగళవారం జరిగిన ఎన్నికలలో దాదాపు 60 శాతం ఓట్లు పొందారు. మిల్లర్ దేశంలో తొలి ఇండో అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్. అంతేకాకుండా తొలి ఆసియా అమెరికన్ కూడా కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. హైదరాబాద్‌లో పుట్టిన మేరీకి 58 సంవత్సరాలు. ఆమె కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో ఉండగా కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. తాను 1972లో అమెరికాకు వచ్చానని. తన సేవలతో ఏ దశలోనూ అమెరికా పట్ల ఉన్న గౌరవభావాన్ని చాటుకుంటూ వచ్చానని, జీవితకాలంలో తాను చేసిన ఏ వాగ్ధానాన్ని అయినా నెరవేర్చేందుకు కృషి చేస్తూ వచ్చానని ఈ జన్మతః దరాబాదీ తెలిపారు. మేరీ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు, కాలిఫోర్నియాలో ఉద్యోగం చేశారు. తరువాత హవాయి, వర్జీనియాలలో కూడా ఉద్యోగాలు చేసి చివరికి మేరీల్యాండ్‌కు చేరారు. అక్కడ చాలాకాలం ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ మెంట్గోమెరీ కౌంటీ విభాగంలో పనిచేశారు. ఇక ఈ రాష్ట్రానికి గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికలో ఆఫ్రికన్ అమెరికన్ అయిన వెస్ మూరే గెలిచారు.

అధికార పార్టీ నుంచి గెలిచిన ఇండో అమెరికన్లు
ఇప్పుడు జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికలు భిన్నమైన ఫలితాలకు దారితీశాయి. డెమోక్రాటిక్ పార్టీ తరఫున రంగంలోకి దిగిన రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. మరికొందరుకూడా రాష్ట్రాల స్థాయిలో జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ఇక ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చిన శ్రీ థానేదారు అధికార డెమోక్రాటిక్ పార్టీ తరఫున తొలిసారిగా మిచిగాన్ నుంచి విజయం సాధించారు. ఇక్కడి రిపబ్లికన్ అభ్యర్థి మార్టెలి బైవింగ్స్‌ను ఓడించారు. ఇప్పటి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున ఇద్దరు ఇండో అమెరికన్లు గెలిచారు. వీరిలో బాబీ జిందాల్ లూసియానా నుంచి, నిక్కి హేలీ సౌత్ కరోలినా నుంచి విజయం సాధించారు. మేరీ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు, కాలిఫోర్నియాలో ఉద్యోగం చేశారు. తరువాత హవాయి, వర్జీనియాలలో కూడా ఉద్యోగాలు చేసి చివరికి మేరీల్యాండ్‌కు చేరారు. అక్కడ చాలాకాలం ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ మెంట్గోమెరీ కౌంటీ విభాగంలో పనిచేశారు.

Aruna Miller becomes Maryland Lieutenant Governor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News