Friday, December 20, 2024

నేడే సిక్కిం , అరుణాచల్ అసెంబ్లీ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనుండగా, దీనికి రెండు రోజులు ముందుగానే జూన్ 2 న అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కిం లోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. కాగా, లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగిన ఆంధ్రప్రదేశ్ , ఒడిశా ఫలితాలు యధాప్రకారం జూన్ 4న వెలువడతాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ మొత్తం 60 సీట్ల లోను పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లు రాష్ట్రంలో మరో రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజెపీ ఇప్పటికే పోటీ లేకుండా 10 స్థానాల్లో గెలుపొందింది.

ఈసారి అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82.95 శాతం పోలింగ్ జరిగింది. 2019లో 82.17 శాతం పోలింగ్ జరిగింది. సిక్కింలో ప్రధాన పోటీ అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం), సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డిఎఫ్) మధ్య ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌లు మరో రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 79.88 శాతం పోలింగ్ జరగ్గా, 2019లో 81.43 శాతం పోలింగ్ రికార్డయింది. 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుని , పెమాఖండూ తిరిగి సిఎం అయ్యారు. కాంగ్రెస్ 4 సీట్లు , జేడీయూ 7, ఎన్‌పీపీ 5 సీట్లు గెలుచుకున్నాయి. సిక్కింలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌కేఎం 17 సీట్లతో మెజారిటీ సాధించగా ప్రేమ్‌సింగ్ తమంగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎస్‌డీఎఫ్ 15 సీట్లకు పరిమితమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News